మానవ హక్కులు

None selected Skip to content Using Gmail with screen readers in:sent Meet Hangouts Conversations 7.14 GB of 15 GB used Terms · Privacy · Program Policies Last account activity: 1 hour ago Details ఆటవిక సమాజంలో బలమున్నవాడిదే రాజ్యంగా కొనసాగుతుంది. ఆధిపత్యం వహించి, మిగిలిన ప్రజల్నందరినీ నియంత్రించి, అధికారం, నియంతృత్వం చెలాయించి పీడనకు తెగబడడం, అసంఖ్యాకులను బానిసలుగా హింసకు గురిచేయడం ఆ సమాజంలో సాధారణ అంశం. ఈవిధమైన ఆధిపత్యం వహించడం, వంచన, మోసం, బలప్రయోగం, కుతంత్రాలతో నిండివుంది. ఇక్కడ మానవత్వానికి, నిజాయితీకే ఏమాత్రం అవకాశంలేదు. ఈ రకమైన వ్యవస్థకు మతఆధిపత్య వర్గం వెన్నుదన్నుగా ఉంటూ వుంది. ఒకవైపు ఉన్నతంగా కనబడే మత నీతి సూత్రాలు వల్లిస్తూ, ఆపరదా చాటున, మనుషులు తమపై అమలు జరుగుతున్న హింస, వివక్షను ఎదిరించకుండా బానిసమనస్తత్త్వంతో ఉండాలని ఉద్భోదిస్తూ ఉంటుంది. వాటన్నిటికీ పరలోకంలోనే పరిష్కారం దొరుకుతుందని నమ్మించడం ప్రపంచ వ్యాపితంగా శతాబ్దాల తరబడి కొనసాగింది. ఐతే, ఈ దురన్యాయాలకు వ్యతిరేకంగా ప్రపంచమంతా తిరుగుబాట్లు జరిగేయి. ఆధిపత్య వ్యవస్థను ధిక్కరించి, అల్లాడించిన బానిసల తిరుగుబాట్లు చరిత్రలో మనకు ఎన్నో కనుపిస్తాయి. బ్రిటన్ లోని యుద్ధ ప్రభువులకు సంబంధించిందే అయినా, అది పరిమిత ప్రాధాన్యం మాత్రమే కలిగి ఉన్నా, 1215లో కొన్ని హక్కులు కల్పిస్తూ ఇచ్చిన 'మాగ్నాకార్టా' కు ఎంతో ప్రాధాన్యముంది. ఆధునిక యుగంలో మానవ హక్కుల విషయంలో తాత్వికంగా నిర్దిష్ట భూమికను ఏర్పరిచినవారుగా "సామాజిక ఒడంబడిక" సిద్ధాంత కర్తలను చెప్పుకోవచ్చు. ఆంగ్ల తత్త్వవేత్తలు,థామస్ హాబ్స్ 1951లో రాసిన లెవాయథాన్ అనే గ్రంధంలోను, జాన్ లాక్ 1690లో రాసిన టుట్రీటైసెస్ఆన్ సివిల్ గవర్నమెంట్ అనే గ్రంధంలోను, ఫ్రెంచ్ తత్త్వవేత్త జీన్ జాక్వెస్ రూసో 1755లో రాసిన డిస్కోర్స్ ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ ఇనీక్వాలిటీ అనే గ్రంధంలోనూ సమాజ సమ్మతితోనే రాజ్య వ్యవస్థ ఏర్పడిందని, అది ప్రజల హక్కులకోసం పని చేయాలనీ చెప్పేరు. ఈ గ్రంధాలు ఐరోపాలో గొప్ప మార్పులకు ఊతమిచ్చాయి. ముఖ్యంగా ఫ్రెంచి విప్లవానికి ఇది కరదీపికగా మారింది. రాజ్య వ్యవస్థ ప్రజామోదం పొందే కొన్ని సూత్రాలప్రకారం నడవాలనే అంశాన్ని శిస్ట జనాలు అందిపుచ్చుకోవడంతో, ప్రపంచంలోని అనేక దేశాలలో రాజ్యాంగాలు తయారవడానికీ, రాజ్యాంగ బద్ధ ప్రభుత్వాలు ఏర్పడడానికి, కారణమైంది. మానవ హక్కులు, చట్టసమాన పాలనకోసం జరిగిన అనేక పోరాటాల ఫలితంగా, 1948 డిసెంబర్ 10వ తేదీన ఐక్యరాజ్య సమితి 'ప్రపంచ మానవ హక్కుల ప్రకటన వెలువరించింది. ప్రపంచ మానవ హక్కుల చరిత్రలో దీల్లి ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధిసభ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన భిన్న సాంస్కృతిక నేపధ్యాలున్న, చట్టపర అంశాలలో నిష్ణాతులైన్న ప్రతినిధులు రెండేళ్లపాటు కష్టపడి దీన్ని రూపొందించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాట్లు, ప్రతిహింసలకు పాల్బడే వాతావరణాన్ని నివారించడానికి, వ్యవస్థను చట్టబద్ధ పాలనతో ప్రజాస్వామ్యయాతంగా నడిపించాలి. ప్రపంచమంతటా మానవ హక్కుల పట్ల నిర్లక్ష్య ధోరణి, హక్కులను తిరస్కరించడం, మానవత్వానికి మచ్చలా తయారై,అణచివేత, తీవ్రమైన మానవ హింసకు కారణమయేయి. భావ ప్రకటన స్వేచ్చ, నమ్మిక, విశ్వాసాల విషయంలో స్వేచ్చ, భయం, అభద్రతాభావాలనుంచీ స్వేచ్చ, ఆకలి, కన్నీళ్ళు , దోపిడీ నుంచీ విముక్తి పొందే స్వేచ్చ ఉన్న ప్రపంచాన్ని పొందడంకోసం ఈ ప్రకటన మానవాళికి ఉత్తేజాన్నిస్తుంది. మానవ హక్కుల పరిరక్షణకు, అన్నీ అంశాలలో స్త్రీపురుష సమానత్వానికీ, హక్కులను ఏవిధంగానూ, ఏరూపంలోనూ అణచివేయడానికి వీలు లేని సమాజం నిర్మించేందుకు నిరంతరాయంగా కొనసాగించాల్సిన కృషికి గుర్తుగా ఈ దినాన్ని "మానవ హక్కుల దినోత్సవం'గా అన్నీ దేశాలూ పాటించాలని నిర్దేశించారు. ప్రపంచంలోని మానవులంతా ఏవివక్షాలేని సమాన గౌరవం, శాస్విత హక్కులూ కలిగి ఉన్నారనీ, అన్ని దేశాలూ ఈ హక్కులను పరిరక్షించుకోవాల్సి ఉంటుందనీ, అందులో పేర్కొన్నారు. ఈ ప్రకటనలోని ప్రధానాంశాలు అధికరణం 1 ప్రకారం, మానవులందరికీ పుట్టుకతోనే స్వేచ్చ, సమానత్వం వస్తాయి. హక్కులు, గౌరవం విషయంలో అంతా సమానమేఐనా, వ్యక్తిగతంగా పరతి ఒక్కరికీ, సొంత ఆలోచన, అంతఃచేతన ఉంటాయి. పరస్పరం సౌబ్రాతృత్వ భావనతో మెలగాలి. అధికరణం 2 ప్రకారం, ఈ పత్రంలోని హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయి. జాతి, రంగు, మతం, భాష, జాతీయత, సామాజిక మూలాలు, ఆడ మగ తేడా, పుట్టుక, రాజకీయంగా లేదా ఇతరత్రా భిన్న అభిప్రాయాలు ఉండడం, ఆస్తిపాస్తులలోని తేడాలవల్లగానీ, మరే ఇతర ప్రాతిపదికపైగానీ మనుషులమధ్య వివక్ష చూపడానికి వీలు లేదు. అధికరణం 3 ప్రకారం జీవించేందుకు, స్వేచ్చగా నడుచుకునేందుకు, తననుతాను రక్షించుకోవడానికీ ప్రతిమనిషికీ హక్కు ఉంది అధికరణం 4 బానిసత్వాన్ని, బానిస వ్యాపారాన్నీ అన్నిరూపాలలో నిషేధించాలని చెబుతోంది అధికరణం 5 ఎవ్యక్తినీ చిత్రహింసలకు గానీ, అమానవీయమైన, క్రూర లేదా అవమానకరమైన శిక్షకు గురిచేయకూడదు. అధికరణం 6 చట్టం ముందు అంతాసమానమేనని, సమాన గుర్తింపు పొందే హక్కు ప్రతి మనిషికీ ఉన్నట్లు నిర్ధారిస్తోంది. అధికరణం 7 ప్రకారం, చట్టంద్వారా రక్షణ పొందేందుకు ఏవివక్షా లేకుండా అందరకూ సమాన హక్కు ఉంది. అధికరణం 8 దేశ రాజ్యాంగం లేదా చట్టం కల్పించిన ప్రాధమిక హక్కులకు భంగం కలిగే అంశాలకు సంబంధించి, సంబంధిత జాతీయ ట్రిబ్యూనల్ నుంచీ న్యాయం కోరే హక్కు ప్రతిఒక్కరికీ ఉంది. అధికరణం 9. సరైన విచారణ లేకుండా ఎవరినీ ఏకపక్షంగా అరెష్టు చేయడానికిగానీ, నిర్బంధించడానికిగానీ, ప్రవాసానికి పంపడానికిగానీ వీలులేదు అధికరణం 10. హింసకు పాల్బడ్డ నేరాలకు సంబంధించి లేదా ఒక వ్యక్తి హక్కులు, బాధ్యతలు నిర్ణయించే విషయమైగానీ, స్వతంత్రంగా వ్యవహరించే ప్రత్యేక న్యాయస్థానం అధ్వర్యంలో బహిరంగ, నిస్పాక్షిక విచారణ పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది అధికరణం 11. శిక్షార్హమైన నేరం చేసినట్లు అభియోగాన్ని ఎదుర్కొనే ప్రతివ్యక్తీ, నిష్పాక్షిక, బహిరంగ విచారణలో చట్టనిబంధనల ప్రకారం దోషిగా తేలేవరకూ, సదరు వ్యక్తిని నిర్దోషిగానే భావించాలి. అంతర్జాతీయ లేదా జాతీయ చట్ట ప్రకారం, ఒకవ్యక్తిపై మోపిన నేరం శిక్షార్హమైంది కాకపోతే, సదరు వ్యక్తిని శిక్షార్హమైన నేరంలో దోషిగా పరిగణించడానికి వీలు లేదు. శిక్షార్హమైన నేరం చేసినపుడు, న్యాయ చట్టంలో విధించిన పరిమితికి మించి శిక్ష విధించడానికి వీలు లేదు. అధికరణం 12. వ్యక్తి సమాచార మార్పిడి, ఉత్తర ప్రత్యుత్తరాలు, ఇల్లు, కుటుంబం, వంటి గోప్యతాంశాలకు భంగకరమైన అంశాలలో ఏరకమైన జోక్యం చేసుకోడానికి, గౌరవ ప్రతిష్టాలపై దాడి చేయడానికిగానీ వీలు లేదు. ఇటువంటి జోక్యం, దాడులనుంచీ రక్షణపొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అధికరణం 13. దేశంలో ఎక్కడికైనా స్వేచ్చగా తిరిగే, ఎక్కడనైనా నివసించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. స్వంత దేశం లేదా ఏదేశంనుంచీ ఏదేశానికిగానీ, లేదా స్వంత దేశానికి వచ్చే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది, ఐరాస సూత్రాలకూ, ప్రయోజనాలకూ విరుద్ధమైన చర్యలు లేదా రాజకీయేతర నేరాలపై విచారణ జరిగే సందర్భంలో ఈ హక్కు పరిమితం చేసే వీలుంది . అధికరణం 14. పీడననుంచీ తప్పించుకొనేందుకు ఇతర దేశాలను ఆశ్రయించడానికీ, ఆశ్రయం పొందడానికీ ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది అధికరణం 15. ప్రీతి ఒక్కరికీ జాతీయత కలిగి ఉండే హక్కు ఉంది. ఏకపక్షంగా జాతీయతాను తొలగించకూడదు. జాతీయతని మార్చుకులే హక్కు నిరాకరించకూడదు. అధికరణం 16. జాతి, మతం,జాతీయతవంటి ఆటంకాలు లేకుండా, వివాహం చేసుకొనేందుకు, కుటుంబాన్ని కలిగి ఉండేందుకూ, దాన్ని రద్దు చేసుకునే విషయంలోనూ వయోజనులైన స్త్రీపురుషులందరికీ సమానంగా పూర్తి హక్కులు ఉన్నాయి. పెళ్ళికి వధూవరులిద్దరి సంపూర్ణ, స్వేచ్చాయత అంగీకారం ముఖ్యంగా పరిగణించాలి. సమాజంలో కేంద్రబిందువుగా ఉండే కుటుంబమనే ప్రాధమిక విభాగాన్ని రాజ్యం తప్పనిసరిగా రక్షించాలి. అధికరణం 17. ప్రతి ఒక్కరికీ స్వంతగా ఆస్తి కలిగిఉండే హక్కుఉంది. ఎవరినుంచీ ఏకపక్షంగా ఆస్తిని స్వాహీనం చేసుకోడానికి వీలు లేదు. అధికరణం 18. ప్రతి వ్యక్తీ మనఃస్సాక్షి, అంతఃకరణలు చెప్పిన ప్రకారం నడచుకోవడానికీ, ఇతరుల ప్రమేయం లేకుండా సొంత అభిప్రాయాలు కలిగి ఉండడానికీ, మతాన్ని, మతవిశ్వాసాన్ని మార్చుకోడానికీ, తన మత విశ్వాసాలను పాటించే, బోధించే స్వేచ్చా ప్రతి ఒక్కరికీ ఉంది. అధికరణం 19. భావ ప్రకటన హక్కు. ఏవిధంగానైనా సమాచారం కోరే, స్వీకరించే, సొంతభావాలు ప్రకటించే హక్కు ఉంది. అధికరణం 20. స్వేచ్చగా, శాంతి యతంగా సమావేశం కావడానికీ, సంఘంలో చేరేందుకు, సంఘాన్ని ఏర్పాటు చేసుకొనేందుకూ హక్కువుంది. ఏసంఘంలోనైనా చేరమని ఎవరినీ నిర్బంధించడానికి వీలు లేదు. అధికరణం 21. ఎన్నుకున్న ప్రతినిధిద్వారా పాలనలో భాగమయే అధికారం ప్రతివ్యక్తికీ ఉంది. ప్రజాభీష్టం వ్యక్తం కావడానికి స్వార్వజనీన, స్వేచ్చయుత రహస్య ఎన్నికలు జరగాలి. అధికరణం 22. దేశంలోని ప్రతి మనిషికీ సామాజిక భద్రతాహక్కు ఉంది. వ్యక్తి గౌరవానికీ, వ్యక్తిత్వం స్వేచ్చగా అభివృద్ధి చెందడానికీ, అవసరమైన ఆర్ధిక, సామాజిక సాంస్కృతిక హక్కులను జాతీయ అంతర్జాతీయ కృషి, సహకారాలద్వారా పొందే హక్కు ఉంది. అధికరణం 23,పనిచేసే హక్కు ప్రతి పౌరునికీ ఉంది. అభిరుచి ఉన్న పనిలో ఉపాధి పొందడానికీ, నిరోద్యోగం నుంచీ రక్షణ పొందడానికీ హక్కు వుంది. ఏరకమైన తేడా లేకుండా సమాన జీతం/కూలీ పొందడానికి సమాన హక్కు ఉంది. కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది. అధికరణం 24. ప్ర్తివారికీ హేతుబద్ధమైన పని గంటల పరిమితి, వేతనంతోకూడిన సెలవు, విశ్రాంతి, విరామ హక్కులు అధికరణం 25. ప్రతివ్యక్తికీ ఆహారం, దుస్తులు, వైద్యసేవలు, దుస్తులు, ఇతర సామాజిక సేవలు పొందే హక్కు, నిరుద్యోగం, అనారోగ్యం, వైకల్యం, వైధవ్యం, వృద్ధాప్యం, వంటి కారణాలు లేదా జీవనోపాధి లేకపోవడం నుంచీ భద్రత పొందే హక్కు ఉంది. గర్బిణీలకు, శిశువులకు, అనాధ పిల్లలకూ పూర్తి రక్షణ కల్పించాలి అధికరణం 26. విద్యాహక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. నిర్బంధ ప్రాధమిక విద్యతోబాటు, సాంకేతిక విద్యా, వృత్తి నైపుణ్య విద్యా అందరికీ అందుబాటులో ఉండాలి. ప్రతిభ ప్రాతిపదికన ఉన్నతవిద్య అందరికీ సమంగా అందాలి. మానవ హక్కులు, మౌలిక స్వేచ్చాస్వాతంత్రాలను పరిరక్షించడం విద్యా లక్ష్యంగా ఉండాలి. ఏతరహా విద్యా చదవాలనే విషయమై ఎంచుకునేందుకు తల్లిదండ్రులకు స్వేచ్చ ఉంది. అధికరణం 27. ప్రతి వ్యక్తికీ సమాజ జీవనంలో స్వేచ్చగా పాల్గొనడానికి, కళలను ఆస్వాదించడానికీ, వాటిప్రాయోజనాలు పొందడానికీ హక్కు ఉంది. తను సృజించిన శాస్త్రీయ, సాహిత్య, కళా ఉత్పత్తుల నుంచీ వచ్చే నైతిక, భౌతిక ప్రయోజనాలను పరిరక్షించుకునే హక్కు ఉంది. అధికరణం 29. తన వ్యక్తిత్వ వికసనం సాధ్యం చేసుకునే పరిస్తితులు సమాజంలోని అందరకూ లభ్యమయేట్లు చూడాల్సిన బాధ్యత కూడా వ్యక్తులపై ఉంది. ఇవేవీ ఇరాస సూత్రాలకు వ్యతిరేకంగా ఉండకూడదు. అధికరణం 30. ఈ ప్రకటనలోని ఏఅంశమైనా, ఇందులో నిర్దేశించిన హక్కులు, స్వేచ్చా స్వాతంత్రాల్లో దేనికైనా భంగం కలిగించేందుకూ, ధ్వంసం చేసేందుకు, ఏబ్రభుత్వానికీ హక్కులేదు. ఈ ప్రకటన ప్రపంచ ప్రజానీకానికి చేరాలనే లక్ష్యంతో ఐదువందల భాషలలోకి అనువదించారు. ఈ సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన ఆమోదించినపుడు, ఇది అన్నిదేశాలూ ఆమోదించాల్సిన సాధారణ ప్రమాణంగా మాత్రమే ఉందికానీ చట్టబద్ధంగా లేదు. ఐరాస 21వ సర్వసభ్య సమావేశంలో, దీన్ని 1966 డిసెంబర్ 16న ఒక ఒప్పందంగా స్వీకరించారు. ఇది ఆర్ధిక,సామాజిక రాజకీయ, సాంస్కృతిక హక్కులపై అంతర్జాతీయ ఒప్పందం; పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒప్పందం రూపంలో ఆమోదించారు ఈ మానవ హక్కుల ప్రకటన ఆధారంగా, ప్రభుత్వేతర హక్కుల పరిరక్షణ సంస్థగా 'అమ్నెస్టీ ఇంటర్ నేషనల్ ' అనే సంస్థ 1961 జులై లో పేటర్ బెనెన్సన్ అధ్వర్యంలో యునైటెడ్ కింగ్డంలోని లండన్ లో స్థాపితమైంది. ఈ సంస్థకు చెందిన సభ్యులు, రచయితలు, ప్రపంచవ్యాపితంగా మానవహక్కుల పరిరక్షణకు ఎంతో కృషి చేశారు. ఎన్నో దేశాలలో అక్రమంగా ఏళ్లతరబడి జైళ్ళలో మగ్గుతున్న వేలాది రాజకీయ ఖైదీల విడుదలకు ఈ సంస్థ ఎంతో పాటుచేసింది, చెరసాలల్లో అన్యాయంగా మగ్గుతున్న అనేకమందిని విడుదల చేయించడంలో విజయం సాధించింది. మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేసినందుకుగానూ ఈ సంస్థకు 1977లో నోబెల్ బహుమానం వచ్చింది. ఈసంస్థ గతయేడాది (2020) సెప్టెంబర్ 20న ఒక సంచలన ప్రకటన చేస్తూ భారత దేశంలో తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. భారత దేశంలో ఎంతో గడ్డు పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన జరుగున్న సందర్భంగా ఈ సంస్థ వాటిని ఎండగడుతున్న కారణంగా, ఓర్వలేని ప్రభుత్వం తమమై అక్రమ ద్రవ్య సరఫరా కేసు పెట్టిందని అంది. భారత దేశం నుంచీ పదిలక్షలమంది తమకు సహాయం చేస్తున్నారని పై ప్రకటనలోని, సంక్షిప్తంగా వివరించిన అంశాల్ని నిశితంగా పరిశీలించేట్లయితే, వివిధ దేశాల రాజ్యాంగ చట్టాలకు, వాటిలో పొందుపరచిన మానవ హక్కులకూ, అనేక న్యాయచట్టాలకూ ఈ ప్రకటన ఆధారభూతంగా ఉన్నట్లు మనకు అర్థమౌతుంది. ప్రపంచ దేశాలను శాసించే అధికారం లేకపోయినా, నైతికత, న్యాయం పునాదులే తన బలంగా, ఆయుధంగా, అంతర్జాతీయ సమాజంపైన, ప్రభుత్వాలపైనా ఒత్తిడి తేవడం ద్వారా ఐక్యరాజ్య సమితి తన బలానికిమించి ఎంతో సాధించింక్దని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అనేక అంశాలపై వివిధ అంతర్జాతీయ సమ్మేళనాలద్వారా సభ్య దేశ ప్రభుత్వాల ప్రతినిధులను ఒప్పించి,పేదలు, స్త్రీలు, అల్పసంఖ్యాకవర్గాలవారు, బడుగు బలహీన వర్గాలవారిపై హింసను నిరోధించి, గౌరవకరంగా బతికేందుకు, మానవ హక్కులను పరిరక్షించేలా అనేక చట్టాలు చేసేలా అంతర్జాతీయ సమాజంనుంచీ ఒత్తిడి పెంచి, ప్రభుత్వాలను ఒప్పించేందుకుగానూ ఇరాస గణనీయమైన కృషి చేసింది. ఈ ప్రకటనలోని అంశాలను అమలు పరచడానికై ప్రతిదేశంలోనూ వివిధ స్థాయిలలో మానవ హక్కుల కమిషన్ లను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రకటించింది. అయితే, ఐరాస లో సభ్యదేశంగా ఆమోదించిన అంశాల్ని చట్టరూపంలో పెట్టేందుకు, సభ్య దేశాలు ఎంతో తాత్సారం చేస్తున్నాయి. మన దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మానవ హక్కుల పరిరక్షణ చట్టాన్ని 1993లో ఆమోదించారు. ఇది 1994 జనవరి 8నుంచీ అమలులోకి వచ్చింది. ఇది చట్టబద్ధమైన సంస్థ మాత్రమేకానీ రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. దీన్ని 2006వ సంవత్సరంలో తిరిగి సవరించి, కొన్ని మార్పులు చేశారు. ఆప్రకారం, ఇదే చట్టాన్ని యధాతధంగా రాష్ట్రాలకు అనువర్తింపజేసి, రాష్ట్ర స్థాయిలో మానవహక్కుల సంఘాన్ని ఏర్పాటుచేసే వీలు కల్పించారు. కేంద్ర స్థాయిలో *************************************************** కమిషన్ల చిరునామాలు 1. జాతీయ మానవహక్కుల కమిషన్‌ ఫరీద్‌కోట్‌ హౌస్‌, కోపర్నికస్‌ మార్గ్‌, న్యూఢిల్లీ -110001 ఫోన్‌: 011 23384012, హెల్ప్‌లైన్‌: 098102 98900 2. ఆంధ్రప్రదేశ్‌ మానవ హక్కుల కమీషన్‌ గృహకల్ప కాంప్లెక్స్‌, ఎంజె రోడ్‌ నాంపల్లి, హైదరాబాద్‌ -500001 ఫోన్‌: 040-24601574, ఫాక్స్‌ : 040-24601573 ******************************************************* మానవ హక్కులుగా పిన్ పేర్కొన్న ప్రకటనలోని అంశాలకు విఘాతం కలిగినా, భంగం ఏర్పడినా, రాజ్య రాజకీయ, పాలనా వ్యవస్థలు లేదా పోలీసు యంత్రాంగం తదితర సంస్థలు లేదా ఇతరత్రా భంగం కలిగినా రాష్ట్ర లేదా కేంద్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు సేసి, సహాయం అర్ధించవచ్చు. ప్రపంచవ్యాపితంగా ప్రజాస్వామ్య ప్రియులు, మానవ హక్కుల ఉద్యమకారులు ఎంతగా పోరాడుతున్నా, హక్కుల విషయంలో రాజ్య వ్యవస్థలు యంత్రాంగం ఎంతో మారవలసిన అవసరం ఉంది. . humanrights.txt Displaying humanrights.txt.

Comments