స్టాన్ స్వామి
None selected
Skip to content
Using Gmail with screen readers
in:sent
Meet
Hangouts
Conversations
7.14 GB of 15 GB used
Terms · Privacy · Program Policies
Last account activity: 1 hour ago
Details
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా కనబడుతున్న భారత ప్రజాస్వామ్యం మేడిపండు చందాన తయారయింది. స్వాతంత్రానికి పూర్వం చప్పన్న దేశాలుగా, భిన్న మతాలు, భాషా జాతులు, సంస్కృతులు, ఆచార వ్యవహారాలతో ఉపఖండంగా ఉండింది. భారత దేశంలోని భాషా సంస్కృతుల భిన్నత్వాన్ని అంగీకరిస్తూ, భిన్నత్వంలో ఏకత్వంగా గౌరవించాల్సిందిపోయి, అన్నిటిలో తీవ్రమైన కేంద్రీకరణ జరుపుతున్నారు. కేంద్రీకరణ పునాదిగా దేశ ఒనరులన్నిటినీ గుప్పెడు మంది ఉత్తరాది బడా కార్పొరేట్ల పరంచేసేందుకు, తద్వారా రాజకీయ పెట్టుబడులను సమీకరించుకోవడానికీ తయారవుతున్నారు. ఆ క్రమంలో ఆదివాసీ ప్రాంతాలలోని వజ్రాలు, విలువైన ఖనిజాల్ని కొల్లగొట్టేందుకు అనువుగా చట్టాల్ని మారుస్తున్నారు. మన తెలుగు భూభాగానికి సంబంధించి, ఇటు నల్లమల అటవీ ప్రాంతంలోనూ, అటు గోదావరి లోయల ప్రాతంలోనూ ఇదే జరుగుతోంది. ఆదివాసుల, దళితుల హక్కుల్ని నిర్దాక్షిణ్యంగా కాలరాస్తూ, వారికి మద్దతుగా గొంతు ఎత్తినవారి గొంతునులిమే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్య వ్యవస్థతో కుమ్మక్కయిన ప్రసార, ప్రచురణ సంస్థలు కూడా అసలు సమస్యల నుంచీ ప్రజల్ని పక్కదారి పట్టించడానికి నానా జిమ్మిక్కులూ చేస్తున్నాయి. జార్ఖండ్ లోని ఆదివాసీ ప్రాంతాల్లో ఎంతో విలువైన ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. భారతదేశ ఖనిజ నిక్షేపాలలో నలబైశాతం అక్కడే ఉంది. వీరికి నిలువ నీడ లేకుండా అక్కడినుంచీ తరిమివేసే ప్రయత్నాలకు అడ్డు పడుతున్నందుకే 'స్టాన్ స్వామి' మరణించేందుకు పాలక వర్గాలు కుట్ర పన్నేయి.
స్టాన్ స్వామి తమిళనాడు లోని తిరుచిరాపల్లి దగ్గరి ఒక కుగ్రామంలో 1937 ఏప్రియల్ 26నజన్మించాడు. జెసూట్స్ అనే క్రైస్తవ సన్యాసులు నడిపే బడిలో చదవడంవల్ల వారి ప్రభావానికి గురయాడు. వారు పవిత్రతతో బాటు, అనాథలు, రొగులు, ఖైదీలు, వేశ్యల వంటివారికి కూడా సేవ చేసేవారు . ఫాదర్ స్టాన్ మనీలాలో తత్త్వ శాస్త్రం చదివేడు. సామాజిక శాస్త్రంలో పిజి డిగ్రీ కూడా చేసేడు. బెంగళూరు లోని ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూట్ కి డైరెక్టర్ గా పని చేసిన కాలం(1975-1990) లో శిక్షణా కార్యక్రమాలద్వారా యువతను ప్రభావితం చేశాడు. అనంతరం జార్ఖండ్ కు వచ్చిన ఆయన తన అధ్వర్యంలో 'బసైచా' అనే జెసూట్ సామాజిక పరిశోధన, శిక్షణా సంస్థను స్థాపించాడు. తుదివరకూ అక్కడే ప్రజలకోసం పాటుబడ్డాడు. అక్రమంగా మూలవాసులను నిర్వాసితుల్ని చేయడం, మానవ హక్కుల ఉల్లంఘనలు, చట్ట వ్యతిరేక భూసేకరణలవంటి ప్రజావ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమించాడు. మతాన్ని స్వార్థానికి ఉపయోగించుకునే అత్యధిక మత నాయకులలా కాకుండా, మతంలోని మంచి అంశాల్ని గుండెల్లో నింపుకున్నందున, పేదలు, ఆర్తులు, అమాయక ఆదివాసుల కోసం గుండెల్లో జాలి, కరుణా, ప్రేమ నింపుకొని, చిత్తశుద్ధితో పని చేశాడు. ఇది హిందూత్వ భావనలను రెచ్చగొట్టి, దాని చాటున దోపిడీకి పాల్బడుతున్న, చేతిలో అధికారం కేంద్రీకృతం చేసుకున్న గుప్పెడు అగ్రకులాలపాలకులకు నచ్చలేదు.
యురేనియం రేడియేషన్ కు వ్యతిరేకంగా ఉద్యమించిన జార్ఖండ్ సంస్థ (JOAR)తో ఫాదర్ స్టాన్ కలిసి పనిచేశాడు. తద్వారా అక్కడ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రవేశించకుండా నిరోధించగలిగేరు. జూడోగోడ,చాటికొచా ప్రాంతంలో నివసించే ఆదివాసీలను నిర్వాసితులను చేసే చైబాసాలో టైలింగ్ ఆనకట్టను నిర్మించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అటవీ భూములు, ఖనిజాలు, తదితర ఒనరులు ఆదివాసీలకే చెందుతాయని ఆయన వాదించేవాడు.
కేంద్ర ప్రభుత్వం 2013లో రూపొందించిన భూసేకరణ చట్తనికి బిజేపి ప్రభుత్వం చేసిన సవరణలవల్ల ఆదివాసీ ప్రజలకు నిలువనీడ లేకుండా చేసి, పెద్ద కార్పొరేట్ సంస్థలకు, బహుళజాతి సంస్థలకూ భూసేకరణ చేయడం తేలికయింది. ఈ సవరణ ప్రకారం భూసేకరణ చేయడానికి సామాజిక ప్రభావాన్ని అంచనా వేయకుండా తేలికగా భూములు స్వాధీనం చేసుకులే వీలుంది. ఈ సవరణను ఆదివాసుల పాలిట మరణ బందిఖానాగా ఆయన అభివర్ణించాడు. ఈసవరణను స్టాన్ స్వామి వ్యతిరేకించాడు. 1996లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం, భూయాజమాన్యం ఉన్న వ్యక్తికి, ఆ భూమి కింద ఉన్న ఖనిజాలపై కూడా హక్కు ఉంది. ఈ తీర్పు సక్రమంగా చట్టరూపందాల్చితే, ఆదివాసీ ప్రాంతాల్లో బడా కార్పొరేట్లు, వాళ్ళకు అండదండలు ఇస్తున్న ప్రభుత్వ ఆగడాలు చెల్లవు. ఈ తీర్పుకు వ్యతిరేకంగా కూడా ఆయన పని చేశాడు. ఇది పాలకులకు కంటగింపుగా మారింది. భారత దేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, విద్యుత్ స్టేషన్లు, నీటిపారుదల పథకాలు, పరిశ్రమలవంటివాటికోసం, ప్రభుత్వం నిర్వాసితుల్ని చేసినవారిలో, పదిహేడు లక్షలకంటే ఎక్కువమంది భారతీయులు అయిపు లేకుండా మాయమై పోయారు.
స్థానిక కౌన్సిళ్లు ఏర్పాటు చేసి, దానిద్వారా గ్రామీణ స్వపరిపాలనను సులభతరంగా నిర్వహించడానికి, తద్వారా అక్కడి ప్రజల హక్కులను కాపాడడానికీ, 2006 అటవీ హక్కుల చట్టం చేశారు. గిరిజన భూములపై, అడవిపై పంచాయతీరాజ్ (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు) చట్టం 1996 (పెసా చట్టం) అమలుకై ఆయన గళమెత్తేడు. గ్రామ సభ ద్వారా స్వీయ పరిపాలన సంప్రదాయాన్ని అమలుజరిపేందుకు వీలు కల్పించే ఈ చట్టాన్ని ఉద్దేశ్యపూర్వకంగా అనేక రాష్ట్రాలలో అమలు చేయడంలేదని స్టాన్ స్వామి ఆరోపించాడు. పారిశ్రామిక వినియోగం కోసం, ఖనిజ సంపద తరలింపుకూ, భూమిని బదలాయించడానికి ఈ గ్రామసభలు అడ్డువస్తాయని భావించిన ఝార్ఖండ్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ఖండించి, పెసా చట్టం అమలుకు అవిశ్రాంతంగా కృషి చేశాడు.
జార్ఖండ్ లోని ఆదివాసీ ప్రాంతాలలో "పథల్ గాడి" అనే ఒక ఆచారం ఉంది. ఆ ఆచారం ప్రకారం, ఆదివాసులు తమ పూర్వీకుల సమాధులమీద బండరాళ్ళు ఉంచే వారు. అక్కడ పనిచేసిన ఐఏఎస్ అధికారి బిడి శర్మా, అతని సహోద్యోగి ఒరవన్ లు, ఆ బండలమీద పెసా చట్టాన్ని, రాజ్యాంగపు ఐదవ అధికరణాన్నీ చెక్కించడం ఒక కార్యక్రమంగా చేపట్టేరు. దీన్నే "పథల్ గాడి" ఉద్యమం అని పిల్చేవారు. స్టాన్ స్వామి ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం వల్ల ప్రభుత్వం ఆయనపై కత్తిగట్టింది.
మానవ హక్కుల కార్యకర్త, న్యాయవాది ఐన సుధా భరద్వాజ్ 'రాజకీయ ఖైదీల సంఘీభావ కమిటీని స్థాపించడం జరిగింది. స్టాన్ స్వామి దీన్ని అత్యంత చురుకుగా పని చేసే సంస్థలలో ఒకటిగా భావించాడు. ఈ సంస్థకు ఎక్కడా మావోయిస్టులతో సంబంధం ఉన్నట్లు రుజువులు లేకపోయినా, ఎన్‌ఐఏ దీనికి మావోయిష్టు లతో సంబంధం ఉన్నట్లుగా ఆరోపించింది. స్టాన్ స్వామి సుధాభరద్వాజ్ తో కలిసి ఎకనామిక్ అండ్ పోలిటికల్ వీక్లీలో ఒక వ్యాసం రాశాడు. జైళ్ళలోని దుర్భర పరిస్థితులు, అక్కడి అధికారులు ఖైదీలపట్ల అమానుషంగా ప్రవర్తించే సంఘటనలనూ అందులో విమర్శించారు. అంతేకాకుండా, నక్సలైట్లను తుదముట్టించడానికి ఉద్దేశించిన కార్యక్రమమే 'ఆపరేషన్ గ్రీన్ హంట్' అనికూడా విమర్శించాడు. 'జైలులో మగ్గుతున్న ఖైదీలు' అనే అంశంపై ఆయన ఒక పుస్తకం ప్రచురించాడు. అక్రమంగా చెరసాలలో మగ్గుతున్న అనేకమంది ఆదివాసులకు తాము ఎందుకు జైలుపాలయిందీకూడా తెలియకుండా సంవత్సరాల తరబడి చెరసాలలో మగ్గుతున్నారని తెలిపేడు. నిరుపేదలైన వారు న్యాయసహాయం పొందే స్థితిలో లేరనీకూడా పేర్కొన్నాడు. ఈ అంశాలన్నీ ఆయనపై ఎన్‌ఐఏ దృష్టి పడేందుకు, రాజ్యం ఆగ్రహించడానికీ కారణమై, ఆయనపై భీమా కోరేగావ్ కుట్రకేసు నమోదు చేయడానికి దారి తీసింది.
భీమా కోరేగావ్ అనేది పుణె జిల్లాలో ఒక కుగ్రామం. దీనికి మరాఠాచరిత్రలో ఒక ప్రత్యేకత ఉంది. 2018 జనవరి 1 వ తేదీన బ్రిటీషు సైన్యంలో అత్యధికంగా ఉన్న దళితుల సేనా విభాగం అక్కడ జరిగిన యుద్ధంలో పీష్వా బాజీరావు సైన్యాన్ని చిత్తుగా ఓడించింది. ఈ విజయానికి ప్రతీకగా యుద్ధంలో వీరమరణం పొందిన దళితుల పేర్లతో, ఈస్టిండియా కంపెనీ ఒక విజయ స్తంభం ఏర్పాటు చేసింది. వారికి నివాళులు అర్పించేందుకు ప్రతియేటా వేలాదిమంది దళితులు అక్కడకు చేరతారు. అందులో భాగంగానే అసంఖ్యాకంగా దళితులు అక్కడకు చేరుకున్నారు. ఈ యుద్ధానికి 2018 జనవరి ఒకటో తేదీకి రెండువందల సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా దీన్ని ఘనంగా జరపాలనుకున్నారు. అందుకు ఒకరోజు ముందుగా దళిత బహుజనులు ఒక భారీ బహిరంగ సభ జరిపేరు. ఆగ్రకులప్రేరేపిత మూకలు, వారికి తోడుగా కాషాయ జెండాలు ధరించిన ఉగ్రవాదులూ సభను భగ్నం చేసే ప్రయత్నం చేశారు. అక్కడ చెలరేగిన అల్లర్లలో ఒక వ్యక్తి చనిపోగా, వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డట్టు తెలుస్తోంది. ఐతే, ఈ సంఘటనలో మావోయిష్టుల ప్రమేయం ఉందని, ప్రధానమంత్రిని హత్య చేయడానికి కుట్ర జరిగిందనీ ఆరోపిస్తూ, వరవర రావు, సాయిబాబాలతో సహా పదహారుమంది రచయితలు, మేధావులు, మానవ హక్కుల కార్యకర్తలపై బెయిలు కూడా దొరకని ఉపా చట్టం కింద నిర్భంధించారు.
ఇదే క్రమంలో స్టాన్ స్వామిని కూడా 2018 ఆగస్ట్ లో ఆయన గదిపై దాడి చేసి, తనపేరు భీమా కోరేగావ్ కేసులో ఉందని చెప్పి, మావోయిష్టు పార్టీ సానుభూతిపరునిగా ముద్రవేసి, ఈయన లాప్ టాప్, ఫోను, కొన్ని సిడి లు స్వాధీనం చేసుకున్నారు. ఓవైపు ఆ కేసు విషయమై తిరుగుతుండగానే, తిరిగి ఉపా చట్టం కింద 2020 నవంబర్ 8వ తేదీన స్టాన్ స్వామిని నిర్భంధంలోకి తీసుకున్నారు. అనంతర కాలంలో, ' ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నవారిలోని రచయిత వరవరరావు కంప్యూటర్లోకి అంతర్జాలం ద్వారా అక్రమంగా ప్రవేశించి, ఈకేసులో అరష్టుకు వీలు కల్పించే అంశాలను నిక్షిప్తం చేసినట్లుగా, అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థకు చెందిన అంకాత్మక విశ్లేషకుడు ఆధారాలతో బయటపెట్టినట్లు పత్రికలలో వార్తలు వచ్చాయి. ఇవే ఆధారాలను స్టాన్ స్వామిని అదుపులోకి తీసుకోవడానికి కారణంగా చూపినట్లు తెలుస్తోంది. తనను పోలీసులు నిర్బంధంలోకి తీసుకోవడానికి రెండురోజులముందు ఆయన విడుదల చేసిన వీడియో సమాచారంద్వారా, "నాపై ఆరోపణలు చేసినట్లు, నేను ఎప్పుడూ భీమా కోరేగావ్ కేసులో లేను. ఈ విధమైన అక్రమ నిర్బంధ ప్రక్రియ నా ఒక్కడిపైనే కాదు. దేశమంతా జరుగుతోంది. భారత పాలకవర్గం చేసే అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకు అనేకమంది మేధావులు, కవులు, రచయితలు, కార్యకర్తలను జైలుపాలు చేస్తున్నారు. ఈ అంశంలో తాను మౌనంగా ఉండిపోకుండా, భాగస్వామి అవుతున్నందుకు సంతోషిస్తున్నా"ననీ అన్నాడు.
ఈయన అరెస్టునివ్యతిరేకిస్తూ, చాలా ప్రదర్శనలు జరిగేయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, కేరళ ముఖ్యమంత్రి పినయరీ విజయన్ ఫాదర్ స్టాన్ స్వామికి న్యాయం జరపాలని విజ్నప్తి చేశారు. వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద, అనేకమంది 'మేం ఫాదర్ స్టాన్ కు సంఘీభావం తెలుపుతున్నా'మంటూ అట్టలపై రాసి , ప్రదర్శన జరిపేరు. స్టాన్ స్వామికి సంఘీభావం తెలుపుతూ 'యునైటెడ్ కింగ్ డం' లోనూ ప్రదర్శనలు జరిగేయి. భారత దేశ భిషప్పులు, కార్డినల్స్ అనే మతాధిపతులూ ప్రధాని మోడీని సందర్శించినా, ఈ విషయంలో మోడీ రిక్త హస్తాలు చూపించాడు.
మానవాళిపట్ల నిజమైన ప్రేమ, దయ, కరుణా కలిగిఉండి, ఎనబై నాలుగేళ్ల వయసులో కూడా సమాజపు నేలమాళిగల్లో మగ్గుతున్న ఆదివాసీ, దళిత, బహుజనులకోసం అవిశ్రాంతంగా కృషి చేసే ఆయనను రాజ్యం 'కరడుగట్టిన నేరస్తునిగా' అభివర్ణించింది. నాడీ వ్యవస్థను దెబ్బతీసే పార్కిన్సన్ అనే వ్యాధి వల్ల ఆయన సరిగా కదలలేడు. నీళ్ళు తాగడానికి గ్లాసు పట్టుకుంటే, ఈవ్యాధి వల్ల చెయ్యి వణికే కారణంగా, నోటితో పీల్చే గొట్టం కోసం అడిగితే కూడా నిరాకరించిన అమానుషత్వం ప్రదర్శించారు. సరిగా శరీర కదలికల్ని కూడా నియంత్రించుకోలేని ఆయనకు సహచర ఖైదీలు ఎంతో సహాయపడ్డారు.
ఆయన బెయిలు కోసం ఎంతగా అభ్యర్ధించినా నిర్దాక్షిణ్యంగా నిరాకరించారు. తాను ఆహారం తీసుకోలేకపోతున్నా, నడవలేక పోతున్న స్థితిలో కనీసం వైద్యపరమైన బెయిలు అయినా ఇవ్వమని కోరేడు. అనంతరం ఆయనకు కోవిడ్ సోకిన తర్వాత, ముంబై లోని ప్రయివేటు వైద్యశాలలో చేరడానికి అనుమతి దొరికింది. అక్కడినుంచే, జులై రెండో తీదీన ఆయన ఉపా చట్టంలోని కొన్ని అంశాలను న్యాయస్థానంలో సవాల్ చేశాడు. జులై నాలుగో తీదీన గుండె పోటుకు గురయిన ఆయన జులై ఐదో తేదీన మరణించాడు.
ఈయన మామూలుగా చనిపోలేదని, రాజ్యం అక్రమంగా ఆయన మరణానికి చేరువ అయేలా చేసి, హత్య చేసిందనీ అనేకమంది రచయితలు, మెథావులూ ఖండించారు. భారత దేశంలో అమలవుతున్న ఉపా ( చట్ట వ్యతిరేక చర్యల నిరోధక చట్టం), దేశ ద్రోహ చట్టం వంటి బ్రిటీషు కాలం నాటి ప్రజావ్యతిరేక చట్టాలు ఎన్నో దశాబ్దాలుగా విచక్షణా రహితంగా, రాజకీయ ప్రయోజనాలకోసం లేదా విమర్శించిన ప్రత్యర్ధులను భయపెట్టడానికో, బెదిరించడానికో, అంతమొందించుకోవడానికో నిస్సిగ్గుగా వాడుకోవడం జరుగుతోంది. అదేసమయంలో ఆ చట్టాల కింద శిక్ష పడాల్సిన వాళ్ళకి పదవులిచ్చి కూర్చోబెడుతోంది. పదహారో శతాబ్దంనాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో విచారణ ఖైదీలుగా ఉన్న, దాదాపు అందరిపై కేసులు కొట్టివేశారు.
అట్లానే కాంగ్రెస్ ప్రభుత్వం 1984 ఇందిరాగాంధీ హత్య సమయంలో అల్లర్లకు పాల్బడిన వారందరిపై కేసులు లేకుండా చేయగలిగింది. సిబిఐ కానీ, ఇతర దర్యాప్తు సంస్థలు కానీ అస్మదీయుల వ్యవహారాలలో అప్పీలుకు కూడ వెళ్ళనంత రాజకీయ బానిసత్వం నడుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో దేశ ప్రజాస్వామ్యం కుంటుపడకుండా ఉండాలంటే వివిధ వ్యవస్థలు ప్రభుత్వాధి నేతలకు కాకుండా రాజ్యాంగానికి విధేయతగా నడుచుకోవాలి. మన అధికార, రాజ్యాంగ వ్యవస్థలలో పనిచేసేవారు చాలామందికి 'చట్ట సమత్వం' అనే పదానికి అర్థం తెలియకుండా వ్యవస్థలను నడుపుతున్న పరిస్తితి నెలకొని ఉంది.
ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉన్న సందర్భంలో, భారత సర్వోన్నత న్యాయస్థానపు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ ప్రజాస్వామ్య స్పూర్తికి పట్టం కట్టేలా, ఒక కేసు సందర్భంలో జూలై పదిహేనో తేదీన ఈ దుష్ట చట్టాల్ని గురించి కీలక వ్యాఖ్యలు చేసేరు. అధికార వ్యవస్థకు జవాబుదారీ తనం లేకుండా ఎవరినైనా ఇరికించే ఈ చట్టాలు ఇంకా అవసరమా? అని, గాంధీ, తిలక్ వంటి స్వాతంత్ర సమర యోధులనుశిక్షించడానికి వాడిన ఈ చట్టంఎందుకు రద్దు చేయలేదని ప్రశ్న లేవనెత్తడం , జరిగింది. "వడ్రంగి తన చేతిలో ఉన్న రంపంతో, వస్తువు చేయడానికి బదులు, మొత్తం అడవినే నరికేయడం ప్రారంభిస్తే ఎలా ఉంటుందో, ఈ సెక్షన్ ప్రభావం కూడా అలాగే ఉంటుం"దని ఆయన వ్యాఖ్యానించాడు. ఇదెంతో ఆహ్వానించదగిన పరిణామం.
వర్తమానంలో ప్రతి వ్యవస్థలోనూ, ప్రతిస్థాయిలోనూ వ్యక్తి ఆరాధన వెర్రి తలలు వేస్తున్నది. ఆషాఢభూతులూ భజనపరులు మాత్రమే అందలాలు ఎక్కుతుండగా, నిష్పక్షపాతంగా వ్యవహరించే వారంతా అణచివేతకు గురవుతున్నారు. విమర్శ ప్రజాస్వామ్యానికి ప్రాణం వంటిది. అది వ్యవస్థలను తమలోని లోపాలను సరిదిద్దుకునేట్లు చేస్తుంది. లోపాల్ని సరిదిద్దుకోవడంద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమౌతుంది. అట్లా వ్యవహరించని పక్షంలో దీని ఉనికికీ, అప్రజాస్వామికంగా వ్యవహరించే వారి ఉనికికి కూడా ముప్పుతెచ్చే పరిణామాలకు దారితీసే ప్రమాదముంది.
అనిసెట్టి. శాయికుమార్
అనువాదం కాదు.
Stansvami (1).txt
Displaying Stansvami (1).txt.
Comments
Post a Comment